ఆశా వర్కర్ల వేతనం పెంపును అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్ల వేతనం పెంపును అమలు చేయాలి

Apr 15 2025 12:47 AM | Updated on Apr 15 2025 12:47 AM

ఆశా వర్కర్ల వేతనం పెంపును అమలు చేయాలి

ఆశా వర్కర్ల వేతనం పెంపును అమలు చేయాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించిన ఆశాల వేతన పెంపును అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.సుభాషిణి కోరారు. సోమవా రం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆశా వర్క ర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేసి పని భారం, యాప్‌లు తగ్గించి ఆశాల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పో స్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. మే ఒకటో తేదీన మే డే సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి కోర్కెల దినాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, జిల్లా ప్రఽధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పి. సుబ్బరాయుడు, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కల్పన, అధ్యక్షురాలు మరియమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి బి. శాంతమ్మ, కోశాధికారి సి.అమ్ములు, అనిత, సుజాత, శోభారాణి, ప్రియదర్శిని, భారతి, నాగలక్ష్మి, మున్ని, లక్ష్మీకాంతమ్మ, పార్వతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement