నా బిడ్డ చెవి నొప్పి సమస్యతో బాధపడుతోంది. డా క్టర్‌కు చూపించడానికి కడప కు వచ్చాను. ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద చూడడం లేదు. అందరూ బంద్‌లో ఉన్నారు. రేపు రమ్మని చెప్పా రు. నా బిడ్డ చెవి నొప్పితో బాధపడుతుంటే ఎలా ఉండాలి. డాక్టర్‌కు ఫీజు కట్టి నా బిడ్డకు చూపించాలనుకుంటున్నాను. – రఫీక్, ఖాజీపేట
నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా పేరు నమోదు కాలేదు
నాలుగు రోజుల నుంచి కడపకు కంటి ఆపరేషన్‌కు సంబంధించి పుష్పగిరి ఐ హాస్పిటల్‌కు నా కుమారుడితో పాటు వస్తున్నా. కానీ ఇక్కడ ‘ఎన్టీఆర్ వైద్య సేవ’కు సంబంధించిన పేరు నమోదు చేయలేదు. ప్రతి రోజూ బస్సు ఛార్జీలు, సమయం వృథా అవుతోంది. ఈ రోజైనా నా పేరు నమోదు అవుతుందో లేదో.
– ఖాజా రసూల్, చాగలమర్రి, నంద్యాల జిల్లా
ఉదయం నుంచి...
ఎడమకన్నుకు ఆపరేషన్ చేసుకోవాలని గతంలో డాక్టర్లు చెప్పారు. పోరుమామిళ్లనుంచి తెల్లవారుజామునే బయలుదేరి పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఉదయాన్నే చేరుకున్నాను. ప్రాథమిక వైద్య పరీక్షల తరువాత ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి పేరు నమోదు చేసేందుకు వచ్చి ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా నమోదు కాలేదు.– రమీజా,పోరుమామిళ్ల
వైద్యం బంద్ అని చెప్పారు...
వైద్యం బంద్ అని చెప్పారు...