కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివారులోని చిన్నచౌక్ గ్రామ సర్వే నెంబర్ 919లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తుండగా సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలను కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
కేసులతో వేధించడం సరికాదు
కడప అర్బన్ : ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన సెక్షన్‌లతో కేసులు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. ఇటీవల రాయచోటిలో జరిగిన సంఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్‌లో ఉన్న బాధితులను శనివారం ఆయన కడప కేంద్ర కారాగారానికి వచ్చి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఇలాంటి ఘటనలపై స్పదించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు.
ఎర్రగుంట్లలో చోరీ
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో అబ్దుల్ సత్తార్ ఇంటిలో చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేష్‌కుమార్ శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. బాధితుతు తెలిపిన వివరాలకు మేరకు ...అబ్దుల్ సత్తార్ రెండు రోజుల క్రితం తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే లోనికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రెండు జతల కమ్మలు, వెండి పట్టీలు, గజ్జెలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్‌కుమార్ తెలిపారు.
గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు సీజ్


