చదువుల కోవెలకు అక్షర హారతి | - | Sakshi
Sakshi News home page

చదువుల కోవెలకు అక్షర హారతి

Sep 13 2024 1:16 AM | Updated on Sep 13 2024 1:16 AM

చదువు

చదువుల కోవెలకు అక్షర హారతి

1952లో సర్‌ సీవీ రాజగోపాలాచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పునాదిరాయి

వైవీయూ: ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో 1948లో ఏర్పాటైన విద్యాలయం దాదాపు 75 సంవత్సరాల పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు విద్యాసుగంధాలు వెదజల్లుతూనే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనుబంధంతో ఏర్పాటైన కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్‌) కళాశాలగా ప్రారంభమైంది. అనంతరం 1968లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, 2008లో కడప యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. 2012–13లో స్వయంప్రతిపత్తి సాధించి అటానమస్‌ హోదాతో ప్రతిఏటా దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులకు సేవలందిస్తోంది.

న్యాక్‌ గ్రేడింగ్‌ సాధించిన

తొలి కళాశాల ఆర్ట్స్‌ కళాశాల

జిల్లాలో 2003–04లో తొలుత న్యాక్‌ అసెస్‌మెంట్‌ బీ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన కళాశాల ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప. అదే విధంగా తొలిసారిగా అటానమస్‌ హోదాను సాధించింది ఇదే కళాశాల కావడం గమనార్హం. 2011లో అటానమస్‌ హోదాను పొందిన కళాశాల ఈ హోదాను 2015–16 వరకు కొనసాగింది. 2012–13 నుంచి కళాశాలలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల విడుదల, సిలబస్‌ రూపకల్పన ఇలా మొత్తం స్వయంప్రతిపత్తిగా వ్యవహరించింది. మళ్లీ ఈ ఏడాది 2020–21 విద్యాసంవత్సరం నుంచి 2025–26 విద్యాసంవత్సరం వరకు అటానమస్‌ హోదాను పొందేందుకు కళాశాల సన్నద్ధమైంది.

2000 చెట్లు ఉన్న ఏకై క ప్రాంతం..

కడప నగరంలో దాదాపు 2వేలకు పైగా చెట్లతో పచ్చదనం, చల్లదనం అందించే ఏకై క ప్రాంతం ఆర్ట్స్‌ కళాశాలే కావడం విశేషం. కళాశాలలోని ప్రతి చెట్టుకు ఒక నంబర్‌ ఇవ్వడంతో పాటు ఆ చెట్టు శాసీ్త్రయనామాలను ఏర్పాటు చేసేయత్నాలు ప్రారంభించారు. దీంతో పాటు 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల గుర్తుగా పైలాన్‌ను ఏర్పాటు చేశారు.

రూ. 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు..

తాము చదివిన కళాశాలకు కొంతైనా చేయాలన్న తలంపుతో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి నడుం బిగించారు. దాదాపు 50 లక్షల మేర నిధులు సేకరించడంతో పాటు కళాశాలలోని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆడిటోరియాన్ని ఆధునికీకరించారు. సెమినార్‌ హాల్‌లో నూతన ఫర్నీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

నేటి కార్యక్రమాలు..

శుక్రవారం ఉదయం 7 గంటలకు కడప నగరంలోని మానస ఇన్‌ హోటల్‌ సమీపం నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు 2 కే రన్‌ నిర్వహణ.

ఉదయం 9.45 గంటలకు ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభం. హాజరుకానున్న జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, కడప ఎమ్మెల్యే ఆర్‌. మాధవిరెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌, విశ్రాంత చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి, కేంద్ర స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పూర్వపు డైరెక్టర్‌ బి.ఎల్‌.ఎస్‌. ప్రకాష్‌రావు, ఇతర అతిథుల చేతుల మీదుగా వేడుకలు ప్రారంభం.

సాయంత్రం 6 గంటలకు ‘పద్మ శ్రీనివాసం’(డివైన్‌ వెడ్డింగ్‌) శాసీ్త్రయ నృత్య ప్రదర్శన.

రాయలసీమ ప్రాంత యువతకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో 1948లో ఏర్పాటైన కళాశాలకు.. 1952లో అప్పటి ముఖ్యమంత్రి సర్‌ సీవీ రాజగోపాలాచారి చేతుల మీదుగా పునాదిరాయి వేయగా, 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ లక్ష్మణస్వామి మొదలియార్‌ చేతుల మీదు ప్రారంభమై.. ఆకట్టుకునే భవన నిర్మాణాలతో ఆర్ట్స్‌ కళాశాలగా రూపుదిద్దుకుంది. 75 సంవత్సరాల కాలంలో ఎన్నో లక్షల మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా తీర్చిదిద్దిన చదువుల కోవెల నేడు 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు సిద్ధమైన వేళ ప్రత్యేక కథనం.

నేడు, రేపు ఆర్ట్స్‌ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు

పూర్వ విద్యార్థుల కృషితో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి

అందుబాటులోకి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆడిటోరియం

తరలిరానున్న పూర్వ విద్యార్థులు

విజయవంతం చేయాలి

75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకలను విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. ఇక్కడ చదివిన ఎందరో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. వారందరూ ఈ వేడుకలకు వస్తున్నారు. సంబరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – డా. జి. రవీంద్రనాథ్‌,

ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప

చదువుల కోవెలకు అక్షర హారతి 1
1/3

చదువుల కోవెలకు అక్షర హారతి

చదువుల కోవెలకు అక్షర హారతి 2
2/3

చదువుల కోవెలకు అక్షర హారతి

చదువుల కోవెలకు అక్షర హారతి 3
3/3

చదువుల కోవెలకు అక్షర హారతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement