
5 వికెట్లు తీసిన సౌత్‌జోన్ బౌలర్ ఆదిల్‌హుస్సేన్
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం మైదానాల్లో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–23 అంతర్ జోనల్ క్రికెట్ పోటీల్లో తొలిదశలో నిర్వహించిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కేఓఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో మూడోరోజు సోమవారం 137 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ జోన్ జట్టు చివరిరోజు ఆట ముగిసే సమయానికి 99.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జట్టులోని రేవంత్‌రెడ్డి 88 పరుగులు, తేజా 68 పరుగులు చేశాడు. నార్త్‌జోన్ బౌలర్లు వాసు 3, గణేష్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా రెస్ట్ ఆఫ్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయగా, నార్త్‌జోన్ జట్టు 272 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో డ్రాగా ముగియగా, నార్త్‌జోన్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో..
36 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన సెంట్రల్‌జోన్ జట్టు 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. జట్టులోని ఎం. వంశీకృష్ణ 81 పరుగులు చేశాడు. సౌత్‌జోన్ బౌలర్ ఆదిల్‌హుస్సేన్ 5 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్‌జోన్ జట్టు 374 పరుగులు చేయగా, సౌత్‌జోన్ జట్టు 362 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియగా, సెంట్రల్‌జోన్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
సెంట్రల్‌జోన్, నార్త్‌జోన్‌లకు
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

81 పరుగులు చేసిన సెంట్రల్‌జోన్ జట్టు బ్యాట్స్‌మన్ వంశీకృష్ణ

88 పరుగులు చేసిన రెస్ట్ ఆఫ్ జోన్ బ్యాట్స్‌మన్ రేవంత్‌రెడ్డి