సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Software engineer commits suicide | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Jun 7 2023 12:40 AM | Updated on Jun 7 2023 11:56 AM

Software engineer commits suicide - Sakshi

సావిత్రి దంపతుల కుమార్తె సురేఖ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో చేస్తోంది.

వైఎస్సార్ : మండలంలోని పల్లవోలు గ్రామంలో బద్రిపల్లె సురేఖ(24) అనే యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మైనుద్దీన్‌ తెలిపారు. పల్లవోలుకు చెందిన సుబ్బరాయుడు, సావిత్రి దంపతుల కుమార్తె సురేఖ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో చేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కడపు నొప్పితో బాధపడుతుండేది.

మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లాలని తన తల్లి సావిత్రితో తెలిపింది. డ్వాక్రా పని మీద చాపాడుకు వెళ్లిన సావిత్రి ఇంటికి తిరిగి రాగా తలుపులు మూసి ఉన్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో పగులగొట్టి చూడగా సురేఖ సీలింగ్‌ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement