భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని కప్రాయిపల్లి గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం తెచ్చి నెలలు గడుస్తున్నా కేంద్రాన్ని తెరవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు ప్రారంభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైస్‌మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటూ నష్టపోతున్నామని వాపోయారు. విషయం తెలుసుకున్న ఏఆర్‌ఐ నర్సింహారెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, మంగళవారం నుంచి కాంటాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గోడళ్ల నాగభూషణ్, మక్తాల మహేందర్‌గౌడ్, గోడళ్ల రాజేశ్వర్, సుంకరి కృష్ణ, మన్నె కిష్టయ్య, ఎర్రబోతు ప్రభాకర్, మక్తాల భీమయ్య, రామాంజనేయులు, గోడళ్ల నర్సింహ, అమరేందర్, సత్తయ్య, యాదయ్య పాల్గొన్నారు


