తల్లి ఆసరా కోసం తనయుడి ఆరాటం | - | Sakshi
Sakshi News home page

తల్లి ఆసరా కోసం తనయుడి ఆరాటం

Nov 24 2026 2:24 AM | Updated on Nov 24 2026 2:24 AM

తల్లి ఆసరా కోసం తనయుడి ఆరాటం

భువనగిరిటౌన్‌ : నరాల వ్యాధితో కాళ్లు, చేతులు చచ్చుపడి ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన కన్నతల్లికి ప్రభుత్వ ఆసరా కల్పించేందుకు ఓ కుమారుడు పడిన ఆరాటం చూపరులను కంటతడి పెట్టించింది. గుండాల మండలం తుర్కల షాపురానికి చెందిన ఉప్పుల ధనమ్మ ఆరేళ్లుగా నరాల బలహీనతతో మంచానికే పరిమితమైంది. నిరుపేద కుటుంబం కావడంతో మందులు కొనే స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో తన తల్లికి పింఛన్‌ మంజూరు చేయించాలనే ఉద్దేశంతో కుమారుడు మహేష్‌ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వీల్‌చైర్‌లో ఆమెను తీసుకొచ్చాడు. కలెక్టర్‌ ఎదుట తన తల్లి దయనీయ స్థితిని వివరిస్తూ, ఆరేళ్లుగా మంచాన పడి ఉన్న ఆమెకు పింఛన్‌ మంజూరు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులు జోడించి వినతిపత్రం అందజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement