ఉమ్మడి జిల్లాలోని 2,309 చెరువుల్లో 582 పూర్తిగా ఖాళీ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలోని 2,309 చెరువుల్లో 582 పూర్తిగా ఖాళీ

Nov 24 2026 2:24 AM | Updated on Nov 24 2026 2:24 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒకప్పుడు నిండుకుండల్లా కనిపించిన చెరువులు ఇప్పుడు నీరు లేక వెలవెలబోతున్నాయి. వర్షాకాలంలో కళకళలాడిన జలాశయాలు క్రమంగా ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో చెరువుల నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు లేకపోవడంతో.. వాటి పరిధిలోని చెరువులకు నీరివ్వలేదు. దీంతో కొన్ని చెరువులు పూర్తిగా ఎండిపోగా, మరికొన్నింటిలో కనీస నిల్వలు లేవు. వీటికితోడు భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న వేసవిలో పంటల సాగు సంగతి పక్కన పెడితే తాగునీటి సమస్య తప్పేలా లేదు.

మూడు జిల్లాల్లో 36.05 శాతమే నీటి నిల్వ

ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,309 చెరువులు ఉన్నాయి. వీటి పూర్తి నిల్వ సామర్థ్యం 36,579.3 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌ (ఎంసీఎఫ్‌టీ) కాగా, ప్రస్తుతం 13,188.7 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే ఉంది. పూర్తి సామర్థ్యంతో పోలిస్తే 36.05 శాతం మాత్రమే ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నాయి. మరోవైపు 582 చెరువులు పూర్తిగా ఎండిపోగా, మరో 966 చెరువుల్లో పావువంతులోపే నీరుంది.

ఆందోళన కలిగిస్తున్న భూగర్భ జలాలు

ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు పడిపోతున్న భూగర్భజలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే నల్లగొండ జిల్లాలో 3.59 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. సూర్యాపేట జిల్లాలో 4.07 మీటర్ల లోతుకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5.92 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. నల్లగొండలో గతేడాది అక్టోబరులో 5.19 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా, ఈసారి అక్టోబర్‌లో 8.78 మీటర్ల లోతుకు పడిపోయాయి. సూర్యాపేటలో 2.99 మీటర్ల లోతు నుంచి 7.06 మీటర్ల తోతుకు పడిపోతాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5.13 మీటర్ల లోతు నుంచి 11.05 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.

ఫ చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 36.05 శాతమే..

ఫ రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఫ వేసవికి ముందే పొంచిఉన్న జలగండం

ఉమ్మడి జిల్లాలో చెరువుల్లో నీటి పరిస్థితి ఇలా..

కేటగిరీ నల్లగొండ సూర్యాపేట యాదాద్రి

మొత్తం చెరువులు 538 410 1361

స్టోరేజీ కెపాసిటీ (ఎంసీఎఫ్‌టీ) 17470 8019.8 11,089.5

ప్రస్తుత స్టోరేజీ (ఎంసీఎఫ్‌టీ) 6,309 4,266.5 2,613.2

స్టోరేజీ శాతం 36.1 53.2 23.6

75–100 శాతం నీరున్నవి 34 56 34

50–75 శాతం నీరున్నవి 77 135 59

25–50 శాతం నీరున్నవి 103 123 140

0–25 శాతం నీరున్నవి 249 71 646

నీళ్లు అసలే లేనివి 75 25 482

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement