అర్హత కలిగిన చర్చిల నిర్వాహకులు ఈ నెల 23 నుంచి 30వ తేదీ లోపు ఆన్‌లైన్ పోర్టల్ tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత, దరఖాస్తు ప్రింట్ కాపీకి అవసరమైన పత్రాలను జతచేసి కలెక్టరేట్ మొదటి అంతస్తులో గల జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయం(గది నంబర్ ఎఫ్–16)లో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది.
భువనగిరిటౌన్ : క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా చర్చిలలో సున్నం వేయడానికి, విద్యుత్ దీపాలంకరణ చేసుకోవడానికి వీలుగా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి చర్చికి రూ.30వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.
అర్హతలు ఇలా..
సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం లేదా ట్రస్ట్ చట్టం కింద నమోదై ఉన్న చర్చిలు మాత్రమే అర్హత గలవి. చర్చిలో క్రమం తప్పకుండా ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం, నిర్వహణ కమిటీ తప్పనిసరిగా ఉండాలి. ఒక్కో చర్చి నుంచి కేవలం దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
జత చేయాల్సిన పత్రాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీ, చర్చి రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం నకలు, నిర్వహణ కమిటీ తీర్మానం కాపీ, చర్చి బ్యాంకు ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సిల్డ్ చెక్ నకలు, పాస్టర్ లేదా అధ్యక్ష, కార్యదర్శుల ఆధార్ కార్డు నకలు, చర్చి ప్రస్తుత స్థితిని తెలిపే ఇటీవలి ఫొటోలు, మంజూరైన నిధులను కేవలం సున్నం వేయడానికి, దీపాలంకరణకు మాత్రమే వినియోగిస్తామంటూ అండర్ టేకింగ్ పత్రం జతచేయాల్సి ఉంటుంది.
ఫ ఒక్కో చర్చి అలంకరణకు రూ.30వేలు
ఫ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఫ 30వ తేదీ వరకు గడువు


