అర్జీలు పెండింగ్‌ పెట్టొద్దు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌ పెట్టొద్దు : కలెక్టర్‌

Nov 24 2026 2:24 AM | Updated on Nov 24 2026 2:24 AM

భువనగిరిటౌన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావుతో 137 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 57, గ్రామీణ అభివృద్ధి 25, మున్సిపాలిటీ 16, మండల పరిషత్‌ 13, సర్వే ల్యాండ్స్‌ 6, సంక్షేమ శాఖ 4, చేనేత, జౌళి 3, పంచాయతీ 3, మైన్స్‌ 2, ఇరిగేషన్‌, వైద్య ఆరోగ్య, విద్య, ఉపాధి కల్పన, వ్యవసాయ, ఆర్‌ అండ్‌ బీ, హౌసింగ్‌, గురుకుల శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ సమావేశంలో డీఆర్‌ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, హౌసింగ్‌ పీడీ అలివేలు, డీపీఓ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

పరిహారం వెంటనే చెల్లించాలి

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా రాయగిరి సర్వే నంబర్‌ 379లో సేకరించిన 25 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఆర్డీఓ కార్యాలయంలో అందజేసినా ఇప్పటికీ పరిహారం జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిళ్లు, ఆర్థిక అవసరాల దృష్ట్యా తక్షణమే నిధులు జమ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

రేషన్‌ డీలర్లకు సంక్షేమ

పథకాలు వర్తింపజేయాలి

తమకు వచ్చే అరకొర కమీషన్‌ సుమారు రూ.7 వేలు.. అద్దె, హమాలీ, కరెంట్‌ బిల్లులకే సరిపోతోందని, అర్హులైన రేషన్‌ డీలర్లకు వివిధ పెన్షన్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగల రాజయ్య వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement