కార్తీక పౌర్ణమికి యాదగిరిక్షేత్రం ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

కార్తీక పౌర్ణమికి యాదగిరిక్షేత్రం ముస్తాబు

Nov 24 2026 2:24 AM | Updated on Nov 24 2026 2:24 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించే భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ భవానీ శంకర్‌ వెల్లడించారు. యాదగిరి కొండకు దిగువన శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో సోమవారం కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం 5గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా రెండు హాళ్లలో వ్రతాలు జరిపిస్తామన్నారు. ఇందుకు తగినట్లుగా సిబ్బందిని నియమించి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్రత టిక్కెట్లు, ప్రసాద కొనుగోలు కేంద్రాల కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మంచినీటి సౌకర్యం సైతం కల్పిస్తున్నామన్నారు. భక్తులు జరిపించే వ్రతాలకు సామగ్రిని సైతం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరి క్షేత్రానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement