భువనగిరి: భువనగిరి ఖిలా త్వరలోనే ప్రపంచ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందబోతోందని తెలంగాణ పురావస్తు, మ్యూజియంల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. నాగలక్ష్మి అన్నారు. సోమవారం పట్టణంలోని భువనగిరి ఖిలా వద్ద నిర్వహించిన ప్రపంచ వారసత్వ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రంగరాజన్, దిడ్డి బాలాజీ, అంజయ్య, మధు, కరణ్, పడమటి అన్వితారెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.
చందుపట్లలో ఆలయం పరిశీలన
భువనగిరి మండలం చందుపట్లలోని విద్దేశ్వరాలయాన్ని తెలంగాణ పురావస్తు, మ్యూజియం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. నాగలక్ష్మి సోమవారం సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని శాసనాలు, పురాతన కోనేరు, మెట్ల బావిని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కంకల లలిత కిష్టయ్య, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యుడు రాములు, హరికీర్తి, వేణుగోపాలశర్మ, జంపాల అంజయ్య, చిన్నం బాలేశ్వర్, సిబ్బంది సంజీవ పాల్గొన్నారు.


