నారసింహుడికి నిత్యారాధనలు | - | Sakshi
Sakshi News home page

నారసింహుడికి నిత్యారాధనలు

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్యారాధనలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టారు. తర్వాత గర్భాలయంలోని మూలవర్యులు, ప్రతిష్ఠాఅలంకార మూర్తులకు అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన, తులసీదళాలతో అర్చన జరిపించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యా ణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సా యంత్రం స్వామి అమ్మవార్లకు జోడు సేవలను చేపట్టారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.

దీపారాధన చేసి..

వ్రతాలు ఆచరించి..

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని మూడో రోజైన గురువారం 342 జంటలు సత్యనారాయణ స్వామి వత్రాలు ఆచరించారు. భక్తులు ఉదయాన్నే కార్తీక దీపారాధన చేసి, కొండ దిగువన ఉన్న వ్రత మండపంలో వ్రతాలు నిర్వహించారు. అనంతరం కొండపైన లక్ష్మీనారసింహ స్వామి వారిని, అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వ్రత మండపంలో వ్రతాలు జరుగుతున్న తీరును ఈఓ భవానీ శంకర్‌ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ దోర్భాల భాస్కర్‌ శర్మ, ఎస్‌పీఎఫ్‌ సీఎస్‌ఓ శేషగిరి రావు, సూపరింటెండెంట్‌ శ్రీలత, తదితరులున్నారు.

ప్రసాదాల కౌంటర్‌ ఏర్పాటు

వ్రత మండపం వద్దనే స్వామి వారి ప్రసాదాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా కౌంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.

ఆ హెచ్‌ఎం మాకొద్దు

ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ. వెంకట్‌రెడ్డి తమకొద్దు అంటూ గురువారం విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆయన తరచూ మద్యం సేవించి వస్తూ, ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల నిధుల్లో అవకతవకలకు పాల్పడటమే కాకుండా, కరాటే ఉపాధ్యాయుడి వేతనం ఇచ్చేందుకు రూ.1,000 కమీషన్‌ తీసుకున్నారని మండిపడ్డారు. అలాగే మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా ఉన్నా హెచ్‌ఎం పట్టించుకోవడంలేదని వాపోయారు. గతంలో డీఈఓ, ఎంఈఓలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ఆందోళన వద్దకు వచ్చిన ఎంఈఓ సైతం హెచ్‌ఎంకే వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులతో పాటు సదరు హెచ్‌ఎంను వెంటనే సస్పెండ్‌ చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గడ్డం అశోక్‌, హనుమంతుల రమేష్‌, కందుల సంతోష్‌, రమేష్‌, అశోక్‌, నాగరాజు, వెంకన్న, శ్రీను. సాయి, శివ తదితరులు పాల్గోన్నారు.

బ్యాంకు పథకాలపై అవగాహన పెంచుకోవడం అవసరం

చౌటుప్పల్‌: బ్యాంకు పథకాలతో చేకూరే ప్రయోజనాలపై ఖాతాదారులు అవగాహన పెంచుకోవడం అవసరమనిహైదరాబాద్‌ ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకులు చిన్మయ్‌కుమార్‌ సూచించారు. చౌటుప్పల్‌ ఎస్‌బీఐ ఆధ్వర్యంలో గురువారం కాట్రేవులో ‘ఆర్థిక సమ్మిళిత పథకాల’ ప్రత్యేక శిబిరం నిర్వహించారు. జన్‌ధన్‌, సురక్ష బీమా, జీవనజ్యోతి బీమా, అటల్‌ పెన్షన్‌ వంటి కేంద్ర పథకాలతో పాటు.. సైబర్‌ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్బీఐ జీఎం ఎంజీ సుప్రభాత్‌, డీజీఎంలు ప్రియబ్రత మిశ్రా, రాజేష్‌ప్రసాద్‌, సునీల్‌కుమార్‌ గోయల్‌, ఏజీఎంలు ప్రదీప్‌చంద్ర, గోపాలకృష్ణమూర్తి, అదనపు పీడీ జంగారెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ వీరన్న, సూర్యాపేట ఆర్‌ఎం అనిల్‌కుమార్‌, సర్పంచ్‌మహేంద్రమణి శరత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement