ఏడు నెలల్లోనే 157 కాన్పులు | - | Sakshi
Sakshi News home page

ఏడు నెలల్లోనే 157 కాన్పులు

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో నమ్మకం పెంపొందిస్తున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 109 కాన్పులు మాత్రమే జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లోనే 157 కాన్పులు కావడం విశేషం.

అందుబాటులోకి

నిపుణులైన వైద్యులు

గతంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో గర్భిణులను నల్లగొండకు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆసుపత్రిలో ముగ్గురు సీనియర్‌ గైనకాలజిస్టులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. మరో సీ్త్ర వైద్య నిపుణురాలు జనరల్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తూనే, గైనిక్‌ విభాగంలోనూ సహాయపడుతున్నారు. వీరికి తోడుగా అనస్తీషియా వైద్యులు నిత్యం అందుబాటులో ఉండటం వల్ల ప్రసవాలు సాఫీగా, సురక్షితంగా జరుగుతున్నాయి.

ఒకేరోజు ఐదు కాన్పులు

ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే వసంత, కీర్తి, ముస్కాన్‌, మనీషా, రేష్మా అనే ఐదుగురు గర్భిణులు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఈ శిశువులను జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త సూర్యశ్రీరావు స్వయంగా పరీక్షించారు.

ఉచిత వైద్యసేవలను ఉపయోగించుకోవాలి: వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఒక్కో కాన్పుకు రూ 40వేల నుంచి రూ 50వేల వరకు ఖర్చు అవుతుందన్నారు.

ఫ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో

పెరిగిన ప్రసవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement