పదేళ్లుగా గుమ్మడి సాగు చేస్తున్నా
మూడు నెలల్లో పంట చేతికొస్తుంది
మాకు ఉన్నటువంటి ఏడున్నర ఎకరాల పొలంలో నాలుగు ఎకరాల్లో నాలుగేళ్లుగా గుమ్మడి సాగు చేస్తున్నా. మిగిలిన దాంట్లో వరి, పత్తి పంట వేస్తున్నా. సరైన ధర లేని నాడు కూడా నాలుగేళ్లలో ఏనాడు నష్టం అనేది రాలేదు. మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. శ్రమ తక్కువ. విత్తనం పెట్టిన తరువాత ఒకటి, రెండు పర్యాయాలు గుంటక తోలి, రెండు, మూడు సార్లు పైమందులు కొడితే సరిపోతుంది. నన్ను చూసి చుట్టుపక్కల పదిమంది గుమ్మడి తోట పెట్టారు.
మాకు సాగునీటి వనరులు లేవు. బోర్లే దిక్కు. బత్తాయి తోట నీళ్లు లేక ఎండిపోయింది. పదేళ్ల క్రితం బత్తాయి తోట స్థానంలో గుమ్మడి పంటను సాగు చేయడం మొదలు పెట్టా. ఎకరం వరి పంటకు అవసరమయ్యే నీటితో నాలుగెకరాల గుమ్మడి తోటను సాగు చేయవచ్చు. బేరగాళ్లే వచ్చి కొనుక్కుపోతారు. ఒక్కోసారి మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్ముకొస్తాను. గుమ్మడి సాగు లాభదాయకంగా ఉంది.
–కొండేటి నర్సిరెడ్డి, రైతు, సిరిపురం
–మేక శంకర్‌రెడ్డి, రైతు, సిరిపురం