గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

కనగల్‌ : కనగల్‌ మండలం ఇస్లాం నగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాల మహానాడు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు తమను అసభ్యకరంగా తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి తలుపులు వేస్తున్నాడని బాలికలు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ తక్షణమే స్పందించి, బాధిత విద్యార్థినుల నుంచి వాంగ్మూలాలు సేకరించాలని, సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య కార్మికుడితో పాటు ఇందుకు బాధ్యులైన అందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బాలికలను వేధించిన వ్యక్తిపై కేసు నమోదు

ఇస్లాంనగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నిడమనూరు బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి బేద్‌ దినేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాలలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న దినేష్‌ కొద్ది రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానంటూ బెదిరించినట్లు తెలిసింది. అయితే కొంతమంది విద్యార్థినులు ధైర్యం చేసి విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మంగళవారం నిందితుడు దినేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ కె.రాజీవ్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఎంపీడీఓ ఆవ వేదరక్షిత, ఎంఈఓ వి.పద్మ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

రామన్నపేట : తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో అధిక లాభాలు సాధిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ సాగుకు భిన్నంగా కేవలం మూడు నెలల పంట కాలం ఉండే గుమ్మడి సాగును ఎంచుకుని ఏటా మంచి లాభాలు గడిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణం గుమ్మడి సాగుకు అనుకూలం. నీటిపారుదల సౌకర్యం ఉన్న ఇసుక నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు గుమ్మడి సాగుకు సరిపోతాయి. కేవలం మూడు నెలల్లో పంట కోతకు వస్తుంది. ఫిబ్రవరి–మార్చి, జూన్‌–జూలై, డిసెంబర్‌–జనవరి నెలలు సాగుకు అనుకూలం. అయితే, ఇది మంచును తట్టుకోలేదు.

ఎకరాకు యాబై వేల వరకు ఆదాయం

సిరిపురం గ్రామంలో సాగునీటి వనరులు తక్కువ. ధర్మారెడ్డిపల్లి కాలువ పూర్తయితే దిగువ భాగంలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మేక శంకర్‌రెడ్డి, కొండేటి నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి రైతులు వరి సాగులో ఎదురవుతున్న నీటి కష్టాలను అధిగమించేందుకు తక్కువ నీటితో సాగయ్యే గుమ్మడి పంటను ఎంచుకున్నారు. మూడు నెలలకు ఒక పంట చొప్పున ఏటా మూడు, నాలుగు పంటలను తీస్తూ ఎకరాకు యాభై వేల వరకు ఆదాయం గడిస్తున్నారు.

ఎకరాకు కిలో చొప్పున విత్తనాలు

పొలాన్ని మెత్తగా దున్నిన అనంతరం సాళ్ల మధ్య రెండు, మూడు మీటర్ల ఎడం ఉండే విధంగా ఎకరాకు కిలో చొప్పున విత్తనాలు నాటుతారు. డ్రిప్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. సాళ్ల మధ్య గడ్డి మొలవకుండా చేను ఎదిగే వరకు గుంటకను తోలుతున్నారు. పూత, కాత సమయంలో భాస్వరం, పొటాషియం వంటి ఎరువులను అందిస్తున్నారు. కాయ ఈగ, పేనుబంక వంటి పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. విత్తిన 90 నుంచి 120 రోజుల వ్యవధిలో కాయ గట్టిపడి, నఖంతో నొక్కితే సులభంగా దిగనటువంటి పక్వానికి వచ్చిన దశలో కాయలను కోసి విక్రయిస్తున్నారు. చాలా వరకు వ్యాపారులే తోట వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన సమయాల్లో రైతులు హైదరాబాద్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు.

సిరిపురం గ్రామంలో సాగుచేసిన గుమ్మడితోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement