పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

భక్తులు సద్వినియోగం చేసుకోవాలి

పంచారామ క్షేత్రాలకు చార్జీలు (పెద్దలు / పిల్లలు)

రామగిరి (నల్లగొండ) : కార్తీక మాస ఆధ్యాత్మిక రద్దీని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజియన్‌ పరిధిలోని 7 డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. పుణ్యక్షేత్రాలైన కాణిపాకం, శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌, అరుణాచలంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలకు ఈ ప్రత్యేక సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సులను నడపనున్నట్లు నల్లగొండ రీజినల్‌ మేనేజర్‌ టి.జ్యోత్స్న వెల్లడించారు.

అరుణాచల గిరిప్రదక్షిణకు

ప్రత్యేక సర్వీసులు

అరుణాచల క్షేత్ర దర్శనం, గిరిప్రదక్షిణ కోసం నల్లగొండ రీజియన్‌ పరిధిలోని డిపో ల నుంచి 22, నవంబర్‌ 2026 నాడు సూ పర్‌ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయి. ఈ సర్వీసులు దర్శనాలు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి నవంబర్‌ 25న డిపోకు చేరుకుంటాయి.

సందర్శించే క్షేత్రాలు

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌, అరుణాచలం (మిర్యాలగూడ డిపో బస్సు కాంచి క్షేత్రాన్ని కూడా కవర్‌ చేస్తుంది).

ప్రయాణ చార్జీల వివరాలు

దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట డిపోల నుంచి పెద్దలకు రూ.4,000 చార్జీ ఉంటుంది. పిల్లల చార్జీలు దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట డిపోలకు రూ.2500 నిర్ణయించారు. యాదగిరిగుట్ట డిపో నుంచి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ. 3,500 చార్జీ ఉంటుంది.

పంచారామ క్షేత్ర దర్శనాల కోసం..

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్ర దర్శనాల కోసం నవంబర్‌ 15, 22, 29, డిసెంబర్‌ 6వ తేదీల్లో (ప్రతి ఆదివారం) ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు.

ఫ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ సేవలు

ఫ నల్లగొండ రీజియన్‌ పరిధిలోని

7 డిపోల నుంచి అందుబాటులోకి..

ఫ ప్రతి ఆదివారం పంచారామ యాత్రలు

కార్తీక మాసంలో పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సురక్షితమైన ప్రయాణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందస్తు సీట్ల బుకింగ్‌, ఇతర వివరాల కోసం స్థానిక ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ కౌంటర్లు, లేదా డిపో మేనేజర్లను సంప్రదించాలి.

–టి.జ్యోత్స్న, నల్లగొండ ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌

దేవరకొండ (సూపర్‌ లగ్జరీ) రూ.2,200/1,200

నల్లగొండ (డీలక్స్‌) రూ. 2,000/1,300

మిర్యాలగూడ (సూపర్‌ లగ్జరీ) రూ.1,800/1,100

యాదగిరిగుట్ట (డీలక్స్‌) రూ. 2,500/1,800

కోదాడ (సూపర్‌ లగ్జరీ) రూ.1,800/1,000

సూర్యాపేట (డీలక్స్‌) రూ.1,800/1,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement