మహిళా హోంగార్డు దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

మహిళా హోంగార్డు దారుణ హత్య

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

నల్లగొండ : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్లగొండ పట్టణంలో కలకలం రేపింది. పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మహిళా హోంగార్డు మహబూబ్‌ బీ భర్త చేతిలో హత్యకు గురయ్యారు. నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త వడ్డే సతీష్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ వెంకట్‌ నారాయణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌ బీ (39)పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం సతీష్‌ను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సతీష్‌ మద్యం తాగి ఇంటికి వచ్చి ప్రతిరోజూ భార్యతో గొడవపడేవాడని సమాచారం.

పిల్లలు స్కూల్‌కు

వెళ్లిన సమయంలో..

మంగళవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో సతీష్‌ భార్యపై దాడికి దిగాడు. ఆమె కిందపడిపోవడంతో ఆమైపె కూర్చుని జుట్టు పట్టుకుని తలను నేలకేసి పలుమార్లు బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్‌ బీ అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డీఎస్పీ శివరాంరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ వెంకట్‌ నారాయణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌ బీ స్వగ్రామం చండూరు మండలం పుల్లెంల కాగా, సతీష్‌ది మిర్యాలగూడ సమీపంలోని కృష్ణాపురం గ్రామం.

ఫ అనుమానంతో భార్యను

అతికిరాతకంగా హతమార్చిన భర్త

ఫ పోలీసు క్వార్టర్స్‌లోనే ఘాతుకం

ఫ పోలీసుల అదుపులో నిందితుడు సతీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement