నిడమనూరు : విపత్తు సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపడుతూ ఆపదమిత్రగా పేరుగాంచాడు అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన కె. శివకుమార్. ఆయన నిడమనూరు మండల కేంద్రంలో నివాసముంటూ జిమ్ ట్రైనర్‌గా పలువురు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల పిలుపు మేరకు ప్రస్తుతం భద్రాచలంలోని 5వ ప్రత్యేక పోలీస్ దళం(స్పెషల్ బెటాలియన్)లో విపత్తు సహాయక చర్యలపై మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తున్నారు. బుధవారం రాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది నీటిలో పడిపోయారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందడంతో శివకుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంతో కలిసి గురువారం తెల్లవారేసరికి ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో ఇద్దరు మత్స్యకారులను కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. దీంతో శివకుమార్‌ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. గతేడాది ఏడాది నిడమనూరు మండలంలోని ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కారు బోల్తా పడినప్పుడు కూడా శివకుమార్ అక్కడకు చేరుకుని రెస్క్యూ టీంతో కలిసి కారును బయలకు వెలికితీయడంలో సహాయ సహకారాలు అందించారు. ఇటీవల హైదరాబాద్‌లో వర్ష విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురికి శిక్షణ ఇచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుంచి కూడా శివకుమార్ ప్రశంసలు అందుకున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న
ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని కాపాడటంలో కీలకపాత్ర
ప్రశంసించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు


