ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

భువనగిరిటౌన్‌ : ఉద్యోగుల సమస్యల పరిష్కా రానికి ఐక్యంగా పోరాడాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవోస్‌) రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు, జిల్లా జేఏసీ చైర్మన్‌ ఎం. ఉపేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరిలో టీజీవోస్‌ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రెండవ వేతన సవరణ సంఘం సిఫార్సులను వెంటనే అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌ప్రసాద్‌, ప్రతినిధి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement