5-11-2026
గడువులోగా అమృత్ పనులు
మోత్కూరు: అమృత్ పథకం కింద చేపట్టిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రత్యేక అధికారి జ్యోత్స్న ఆదేశించారు. మోత్కూరు మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన తాగునీటి సరఫరా అభివృద్ధి పనులను ఆమె బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ జి.నర్సయ్య, పబ్లిక్ హెల్త్ ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


