రామన్నపేట: ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు స్టడీ అవర్ నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.సురేష్‌రెడ్డి సూచించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిశీలించారు. అనంతరం స్టాఫ్ మీటింగ్‌లో మాట్లాడారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధచూపేందుకు కేర్‌టేకర్ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలన్నారు. కళాశాలలో అత్యధిక అడ్మిషన్ల నమోదుకు కృషి చేసిన ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ సి.జగదీష్, అధ్యాపకులు ప్రసూనాదేవి, పున్నారావు, వెంకట్‌రెడ్డి, కిరణ్, నర్సింహారావు, అశోక్‌కుమార్, శ్రీకాంత్, నగేష్,అశోక్‌రెడ్డి, ఉపేందర్‌రావు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, పరశురాములు, శ్రవణ్ పాల్గొన్నారు.


