దరఖాస్తు సరే.. విచారణ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు సరే.. విచారణ ఏదీ?

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

25 నుంచి డిసెంబర్‌ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ

సాక్షి, యాదాద్రి: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియకు జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా క్లెయిమ్స్‌, అభ్యంతరాలకు సంబంధించి మంగళవారం వరకు మొత్తం 38,728 దరఖా స్తులు అందాయి. దరఖాస్తులు పోటెత్తడంతో క్షేత్రస్థాయి విచారణ నెమ్మదించి పెండింగ్‌ సంఖ్య భా రీగా పెరిగింది.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామప క్ష పార్టీలు.. ఓట్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు, క్యాంపులు చేపట్టాయి. కొందరు పట్టభద్రులు స్వ చ్ఛందంగా ఓటు నమోదుకు ఆసక్తి చూపుతున్నారు.

477 దరఖాస్తుల తిరస్కరణ

జిల్లాలో మంగళవారం నాటికి 9,675 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం కాగా, ఇంకా 29,053 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 9,198 ఫారాలను ఆమోదించి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 477 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో అధిక భాగం బీఎల్వోల వద్దే ఆగిపోయాయి. విచారణ కోసం బీఎల్వోల వద్ద 24,223 దరఖాస్తులు నిలిచిపోగా, ఏఈఆర్వోల వద్ద 1,496, ఈఆర్వోల వద్ద 1,364 ఫారాలు ఉన్నాయి. మరో 1,970 దరఖాస్తులు ప్రాసెసింగ్‌ ఉన్నాయి.

భువనగిరి డివిజన్‌లో..

భువనగిరి డివిజన్‌లోని 12 మండలాల్లో మొత్తం 24,292 దరఖాస్తులు అందగా.. 6,241 పరిష్కారమయ్యాయి. ఇంకా 18,051 పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా భువనగిరి మండలంలో 5,777 దరఖాస్తులు రాగా, 5,224 పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆలేరు మండలంలో 2,293కి 1,963, యాదగిరిగుట్టలో 2,504కి 1,707, బీబీనగర్‌లో 2,454కి 1,609 పెండింగ్‌లో ఉన్నాయి. అడ్డగూడూరులో 1,302, ఆత్మకూరు–ఎం 1,221, మోత్కూరు 1,203, తుర్కపల్లి 978, రాజాపేట 824, మోటకొండూరు 796, గుండాల 703, బొమ్మలరామారంలో 521 దరఖాస్తుల విచారణ పూర్తికావాల్సి ఉంది.

చౌటుప్పల్‌ డివిజన్‌లో..

చౌటుప్పల్‌ డివిజన్‌లోని 5 మండలాల పరిధిలో మొత్తం 14,436 దరఖాస్తులు రాగా, 3,434 పరిష్కారమయ్యాయి. 11,002 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. చౌటుప్పల్‌ మండలంలో అత్యధికంగా 3,985 దరఖాస్తులు రాగా, 3,110 విచారణ దశలో ఉన్నాయి. వలిగొండలో 3,425 దరఖాస్తులకు 2,765, రామన్నపేటలో 2,801 దరఖాస్తులకు 2,201, నారాయణపూర్‌లో 1,949కి 1,493, భూదాన్‌ పోచంపల్లిలో 2,276కి 1,433 పెండింగ్‌లో ఉన్నాయి.

29వేల దరఖాస్తులు పెండింగ్‌

ఫ ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలనలో జాప్యం

ఫ వచ్చిన దరఖాస్తులు 38,728 .. పరిష్కారమైనవి 9,675

ఫ నామినేషన్ల ఆఖరు తేదీ వరకు నమోదుకు అవకాశం

ఫ 25న ముసాయిదా ఓటరు జాబితా

గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు గడువును ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు వరకు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.ఈనెల 25న ముసాయిదా ఓటరు జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు. ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు మార్పులు, చేర్పులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement