దివ్యాంగుల గుర్తింపు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల గుర్తింపు పూర్తిచేయాలి

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

భువనగిరి: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులను గుర్తించడం వంద శాతం పూర్తి చేయాలని డీఈఓ భిక్షపతి కోరారు. బుధవారం భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రశస్త్‌ యాప్‌పై మండల రిసోర్స్‌ పర్సన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూడైస్‌ కలిగి ఉన్న అన్ని విద్యా సంస్థల్లో 3 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ చేయాలన్నారు. ఈ నెల 5న మండల స్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సమ్మళిత విద్యా సమన్వయకర్త పెసరు లింగారెడ్డి, జిల్లా రిసోర్స్‌పర్సన్లు శివ, రాజు, రామచంద్రు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయికి నలుగురు విద్యార్థులు ఎంపిక

భువనగిరి: భువనగిరి పట్టణంలోని పెన్షనర్స్‌ భవనంలో బుధవారం 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ‘సైన్స్‌, సుస్థిరత ఆవిష్కరణ కోసం’ అనే ప్రధాన అంశంపై ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని 43 పాఠశాలల నుంచి 86 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం తమ ఆవిష్కరణల ఉద్దేశాన్ని, పనితీరును వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ రంగరాజన్‌ హాజరై మాట్లాడారు. ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్‌ రాజశేఖర్‌, జిల్లా అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ నరసింహాచారి, న్యాయనిర్ణేతలు రాధిక, జ్యోతిర్మయి పాల్గొన్నారు.

ఎంపికై న విద్యార్థులు వీరే

బి. ప్రతీక్‌ (టీజీఎంఎస్‌, గుండాల), జె. భవాని (జెడ్పీహెచ్‌ఎస్‌, వాసాలమర్రి), బి. శ్రీహరిణి (జెడ్పీహెచ్‌ఎస్‌, యాదగిరిగుట్ట),నేమతుల్లా (మోడల్‌ స్కూల్‌)

నేటి నుంచి ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు మాక్‌ టెస్టులు

భువనగిరి: టెట్‌పై ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 5, 6 తేదీల్లో మాక్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 237 మంది టీచర్లు టెస్టులకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక సెషన్‌, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు రెండవ సెషన్‌లో జరుగుతాయని వివరించారు. నారాయణపూర్‌, రామన్నపేట, వలిగొండ మండలాల టీచర్లకు చౌటుప్పల్‌లోని ఆన్న మెమోరియల్‌ స్కూల్‌, బీబీనగర్‌, బొమ్మలరామారం, పోచంపల్లి మండలాల వారికి బీబీనగర్‌ బిర్లా ఓపెన్‌ మైండ్స్‌ స్కూల్‌, తుర్కపల్లి, మోటకొండూరు, మోత్కూర్‌, రాజాపేట, యాదగిరిగుట్టకు చెందినవారికి భువనగిరి గౌతమ్‌ మోడల్‌స్కూల్‌, అడ్డగూడూరు, ఆలేరు, భువనగిరి, ఆత్మకూర్‌, గుండాల మండలాల వారికి భువనగిరి ప్రెసిడెన్షి స్కూల్‌, చౌటుప్పల్‌ మండలం వారికి చౌటుప్పల్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement