సర్కారు కాలేజీల్లో ‘కార్పొరేట్‌’ కళ | - | Sakshi
Sakshi News home page

సర్కారు కాలేజీల్లో ‘కార్పొరేట్‌’ కళ

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి

రామన్నపేట: ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించే ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కాలేజీ బ్యాగ్స్‌, షూస్‌, సాక్స్‌, బెల్ట్‌లను పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను అందజేసిన ప్రభుత్వం.. కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా నాణ్యమైన మెటీరియల్‌ అందిస్తోంది. విద్యార్థులందరిలో సమానత్వ భావనను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.

పంపిణీకి శ్రీకారం

జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, వాటిలో 3,177 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 1,738 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,439 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పంపిణీ చేయడానికి గాను జిల్లాకు ఇప్పటి వరకు 2,997 కాలేజీ బ్యాగులు, 3,802 జతల షూస్‌, 5,351 జతల సాక్స్‌లు, 2,026 బెల్టులు చేరాయి. ఈ సామగ్రిని ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేయగా.. పలు కళాశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ప్రారంభమైంది.

రెండు జతల యూనిఫామ్‌ ఇచ్చేందుకు..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మాదిరిగానే ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఉచితంగా రెండు జతల యూ నిఫామ్‌ను అందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల నుంచి కొలతలు తీసుకోవడం పూర్తయింది. కొద్దిరోజుల్లోనే ఈ యూని ఫామ్స్‌ కూడా విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.

ఫ ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, షూస్‌ పంపిణీ

ఫ జిల్లా వ్యాప్తంగా 3,177 మంది విద్యార్థులకు ప్రయోజనం.

ఫ కొలతలు పూర్తి.. త్వరలో రెండు జతల ఉచిత యూనిఫామ్‌

ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి. తద్వారా మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులందరికీ బ్యాగ్‌లు, షూస్‌, టైలు అందజేస్తాం.

–బి.సురేష్‌రెడ్డి, ఇంటర్‌బోర్డు జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement