యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. బుధవారం ఉదయమే సుప్రభాతం సేవ చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం నిర్వహించి సహస్ర నామార్చన, కుంకుమార్చన చేశారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం జోడు సేవను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు.రాత్రి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.


