టౌన్ హాల్ తరహాలో
అనుమతిస్తే మేలు..
టౌన్‌హాల్ లేదు..
భువనగిరిటౌన్ : భువనగిరి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత అధికారిక సమీక్షలు, ప్రజాసంఘాల సమావేశాలు, సదస్సులు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే, పట్టణంలో వీటికి ఒక్క ప్రభుత్వ టౌన్ హాల్ కూడా అందుబాటులో లేదు. గతంలో సమావేశాలకు వేదికగా నిలిచిన రహదారి బంగ్లా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లను ఆశ్రయించి గంటల వ్యవధికే వేలాది రూపాయలు అద్దెగా చెల్లించాల్సి వస్తోంది. ఇది నిర్వాహకులకు మోయలేని ఆర్థిక భారంగా మారుతోంది.
తాళాలకే పరిమితమైన టీటీడీ కల్యాణమండపం
ఈ సమస్యకు పరిష్కారంగా పట్టణ నడిబొడ్డున ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపాన్ని ప్రజావసరాలకు వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన ప్రాంగణం, డైనింగ్ హాల్, స్టేజ్, గదులు, పార్కింగ్ వంటి సకల వసతులున్నాయి. కానీ, ఇక్కడ కేవలం శాకాహారానికే అనుమతి ఉండటం, సరైన ప్రచారం లేకపోవడంతో శుభకార్యాలు చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఇంతటి అనువైన భవనం నిత్యం తాళాలకే పరిమితమై బోసిపోతోంది.
ఫ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ టౌన్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు
ఫ ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లు, హోటళ్ల అద్దెలతో ప్రజలపై ఆర్థిక భారం
ఫ నిరుపయోగంగా టీటీడీ భవనం.. టౌన్ హాల్‌గా మార్చాలని డిమాండ్
ఫ నామమాత్రపు రుసుముతో కేటాయిస్తే ప్రజలకు ఊరట
టౌన్ హాల్ లేని లోటును దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నిరుపయోగంగా ఉన్న టీటీడీ భవనానికి విస్తృత ప్రచారం కల్పించి, నామమాత్రపు రుసుముతో సమావేశాలు, పుస్తకావిష్కరణలు, విద్యార్థుల సదస్సులు, అధికారిక సమీక్షలకు అనుమతి ఇవ్వాలి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు, ప్రజా సంఘాలకు ఆర్థిక ఊరట లభించడంతో పాటు, టీటీడీకి సైతం నిర్వహణ నిధులు సమకూరుతాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ భవనాన్ని బహుళార్థ సాధక వేదికగా మార్చాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


