సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

భువనగిరి: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా భువనగిరిలో శనివారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భారత్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి వినాయక చౌరస్తా వరకు సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ వాక్‌ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌, సీఐలు వెంకటేశ్వర్లు, చంద్రబాబు, సూర్యనాయక్‌, ఎస్సైలు అనిల్‌కుమార్‌, లక్ష్మీనర్సయ్య పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి

భువనగిరి: ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలని డీఈఓ భిక్షపతి అన్నారు. మోడల్‌, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు జాతీయ స్థాయి నీట్‌, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రముఖ విద్యా సంస్థ డెల్టా అకాడమీ ఛీప్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ శ్రీ హరి అయ్యంగార్‌, రిసోర్స్‌ పర్సన్స్‌ శ్రీనయ్య, జితేందర్‌రెడ్డి, మూర్తి, ఈశ్వర్‌రావు, శ్రీధర్‌రావు, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీకి తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

భువనగిరి: ఢిల్లీలో ఆదివారం నిర్వహించనున్న ఓట్‌ బచావో– దేశ్‌ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం భువనగిరి నుంచి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు తరలివెళ్లారు. వారిలో ప్రోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బర్రె జహంగీర్‌, జీలుగు సతీస్‌పవన్‌కుమార్‌, ఫక్కీర్‌ కొండల్‌రెడ్డి, ప్రదీప్‌, బాబురావు, శ్రీకాంత్‌, చుక్క స్వామి తదితరులున్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీకి ప్రతిష్టాత్మక అవార్డులు

భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐలో శుక్రవారం నిర్వహించిన ఏఎస్‌టీసీ వార్షిక సదస్సు–2026లో దేశ్‌ముఖి విజ్ఞాన్స్‌ వర్సిటీకి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. నాణ్యమైన విద్య, పరిశోధనలను ప్రోత్సహిస్తూ.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకుగానూ వర్సిటీ ఛాన్స్‌లర్‌ పావులూరి సుబ్బారావు ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ను, సీఈఓ డాక్టర్‌ కూరపాటి మేఘన ‘ఎక్స్‌లెంట్‌ అకడమీషియన్‌ అవార్డు’ను అందుకున్నారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ తుమ్మల శ్రీనివాస్‌కుమార్‌ చేతుల మీదుగా వీరు ఈ అవార్డులు స్వీకరించారు. వర్సిటీకి ఒకేసారి రెండు పురస్కారాలు దక్కడం పట్ల వీసీ ప్రొఫెసర్‌ కేవీ కృష్ణకిషోర్‌, రిజిస్ట్రార్‌, ఇతర అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement