వేద మంత్రోచ్ఛారణలతో గిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వేద మంత్రోచ్ఛారణలతో గిరి ప్రదక్షిణ

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహిస్తున్న వేద విద్వన్మహాసభల్లో భాగంగా శనివారం సుమారు 800 మంది వేద పండితులు, వేద విద్యార్థులు వేద మంత్రోచ్ఛారణలతో గిరి ప్రదక్షిణ చేశారు. వేద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణతో పాటు భక్తులలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం వేకుజామున సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలను చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవ సేవ నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement