పశువైద్యుడిగా పెంటయ్య అందిస్తున్న సేవలకుగాను 18 అవార్డులు దక్కించుకున్నారు. వీటిలో ఒకటి జాతీయస్థాయి అవార్డు కాగా, నాలుగు రాష్ట్రస్థాయి, 13 జిల్లా స్థాయి అవార్డులు ఉన్నాయి. 2018లో ఆయన జాతీయ ఉత్తమ పశువైద్యుడి అవార్డు దక్కించుకున్నారు.
ప్రస్తుతం పశువులను మేత కోసం బయటకు తీసుకెళ్లకపోవడం వల్ల వాటిలో మినరల్స్ లోపం ఏర్పడి పాల దిగుబడి తగ్గుతోంది. దీన్ని గమనించిన డాక్టర్ పెంటయ్య.. రైతులకు తక్కువ ఖర్చుతో కాల్షియం, మినరల్స్‌తో కూడిన పోషకాహారం అందించాలని సంకల్పించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.1,250 వరకు ఉండే ఈ మిశ్రమాన్ని.. హైదరాబాద్‌లోని ఓ వర్సిటీతో మాట్లాడి కేవలం రూ.250కే కోదాడకు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. దాతల విరాళాలు, ప్రభుత్వ రివాల్వింగ్ ఫండ్‌తో దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పోషకాహారంతో ఈనిన మూడు నెలలకే గేదెలు మళ్లీ చూడికి వస్తుండడంతో రైతులకు మేలు జరుగుతోంది.
మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్, చిత్రంలో శ్రీనివాసరావు, జడ్జి మాధవిలత, కొల్లు సత్యనారయణ, మామిడి వెంకట్‌రెడ్డి తదితరులు
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సమగ్ర వివరాలు త్వరలోనే డిజిటల్ బాట పట్టనున్నాయి. మహిళా సంఘాల్లో నిధుల గోల్‌మాల్‌కు అడ్డుకట్ట వేసి సంక్షేమ పథకాలను నేరుగా అర్హులకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లఖ్‌పతి దీదీ’ పథకంలో భాగంగా ఈ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ డ్వాక్రా సంఘాల వివరాలను ప్రత్యేక ‘లోకోస్’ యాప్‌లో నమోదు చేస్తుండగా.. అదే తరహా పారదర్శక విధానాన్ని మున్సిపాలిటీల్లోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని సంఘాలకూ వర్తింపజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న సంఘాలు, సభ్యుల పేర్లు, బ్యాంకు రుణాలు, వాటితో నిర్వహిస్తున్న వ్యాపారాలు, నెలవారీగా వస్తున్న రాబడి వంటి సమగ్ర వివరాలను సేకరించేందుకు రిసోర్స్ పర్సన్లకు ప్రొఫార్మా అందించారు.
32,937 మంది సభ్యులు
జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద మొత్తం 32,937 మంది మహిళా సభ్యులు కొనసాగుతున్నారు. వీటి పరిధిలో 114 ఏరియా లెవల్ సమాఖ్యలు, 100 మంది రిసోర్స్ పర్సన్లు, 3,342 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో అత్యధికంగా 1,221 సంఘాల్లో 12,122 మంది సభ్యులు ఉండగా, అత్యల్పంగా మోత్కూరు మున్సిపాలిటీలో 351 సంఘాల్లో 3,415 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల వివరాలన్నీ లోకోస్ యాప్‌లో చేరనుండటంతో పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలు మరింత పారదర్శకంగా మారనున్నాయి.


