యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కల్యాణం చేశారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన చేశారు. ముఖ మండపంలోని బంగారు ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించి, సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధిలో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.


