ఏకాభిప్రాయంతోనే అనుమతులు | - | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయంతోనే అనుమతులు

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

బొమ్మలరామారం: ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటిస్తేనే స్టోన్‌ క్రషర్‌లకు మైనింగ్‌ అనుమతులు లభిస్తాయని జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి స్పష్టం చేశారు. జుపిటర్‌ వెంచర్‌ ల్యాండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 10 హెక్టార్లలో రఫ్‌ స్టోన్‌, రోడ్‌ మెటల్‌ ఉత్పత్తి కోసం మైనింగ్‌ అనుమతుల నిమిత్తం బుధవారం బొమ్మలరామారం మండలంలోని తిర్మలగిరి గ్రామంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించినకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

స్థానికుల డిమాండ్లు

ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కంకర మిల్లుల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించి, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మైనింగ్‌ జరిగే గ్రామాలకే ఆయా క్రషర్‌ల సీఎస్‌ఆర్‌ ఫండ్‌తో పాటు మైనింగ్‌ మినరల్‌ ఫండ్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ఇవ్వాలన్నారు. మండలంలో ఇప్పటికే ఉన్న క్రషర్‌లను అధికారుల బృందం తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంకర మిల్లులపై చర్యలు తీసుకొని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కొండం వెంకట్‌ రెడ్డి, డీఎస్‌పీ రవీందర్‌, భువనగిరి రూరల్‌ సీఐ చంద్రబాబు, స్థానిక ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం, తిర్మలగిరి సర్పంచ్‌ భానోత్‌ కవిత్‌ కుమార్‌, మాజీ సర్పంచ్‌ నూనావత్‌ అశోక్‌, ఉప సర్పంచ్‌ ప్రీతి సుభాష్‌, బానోత్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement