ఆత్మకూరు(ఎం): సాగునీటిని అందించి బతుకుదెరువు చూపుతుందనుకున్న బోరు బావి.. ఆ రైతు కుటుంబానికి విషాదాన్ని మిగులుస్తోంది. పుష్కలంగా నీళ్లు పడుతున్నా, ఆ నీరు విషతుల్యంగా మారడంతో పంటలు ఎండిపోయి ఏటా లక్షల రూపాయల నష్టం వస్తోంది. ఆత్మకూరు(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగుల రవీందర్‌కు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ప్రతి ఏటా పత్తి, కంది, వరి పంటలను సాగు చేస్తున్నాడు. పంటలకు సాగునీరు అందించడానికి ఎనిమిదేళ్ల క్రితం 600 అడుగుల లోతు వరకు బోరు వేశాడు. 24 గంటలు నీరు సమృద్ధిగా రావడంతో మొదట్లో ఆ రైతు ఎంతో సంతోషించాడు. అయితే పక్క రైతుల బోర్లలో మంచి నీళ్లు పడి పంటలు బాగా పండుతుండగా, రవీందర్ బోరు నీరు మాత్రం కలుషితమై విషంగా మారింది. ఈ నీటితో సాగు చేసిన పంటలు పెరగకుండా, వేసినవి వేసినట్లే చనిపోతున్నాయి. దీంతో ఏటా దాదాపు లక్ష రూపాయిల వరకు పెట్టుబడి నష్టపోతున్నాడు. ఒక్కోసారి పక్క రైతుల బోర్ల నీటితో పంటలను కాపాడుకుంటున్నాడు. తన బోరు నీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించానని, ఇప్పటికై నా స్పందించి బోరు నీటిని పరిశీలించాలని రవీందర్ వేడుకుంటున్నాడు.
ఫ ఎదుగుదల లేకుండా
ఎండిపోతున్న పంటలు
ఫ ఏటా లక్ష రూపాయలు నష్టపోతున్న రైతు


