పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు బాగున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు బాగున్నాయ్‌

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు ఎంతో బాగున్నాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రశంసించారు. మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం హాల్‌లో నిర్వహిస్తున్న బ్రిక్స్‌ పార్లమెంటరీ సదస్సు సందర్భంగా భూదాన్‌పోచంపల్లికి చెందిన చిటికి లూమ్స్‌ సీఈఓ తడక వైష్ణవి ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన తిలకించారు. పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు, నాణ్యత, డిజైన్లు చూసి అబ్బురపడ్డారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, విదేశీ ప్రతినిధులు చేనేత వస్త్రాలను పరిశీలించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తడక వైష్ణవి మాట్లాడుతూ.. మన భారతీయ వారసత్వాన్ని బ్రిక్స్‌ పార్లమెంటరీ అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఫ ప్రశంసించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement