శాలిగౌరారం: మండలంలోని ఆకారం గ్రామంలో పత్తి చేనును కోతులు ధ్వంసం చేయకుండా ఓ రైతు వల ఏర్పాటు చేయగా.. కొండచిలువ అందులో చిక్కుకుంది. గ్రామానికి చెందిన మంగలి సైదులు గ్రామ సమీపంలోని తన వ్యవసాయ భూమిలో వేసిన పత్తి చేనును కోతులు ధ్వంసం చేస్తుండడంతో చేను చుట్టూ వల ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం 12 అడుగులకు పైగా పొడవు ఉన్న భారీ కొండచిలువ అందులో చిక్కుకుంది. రైతు సైదులు దీనిని గమనించి గ్రామస్తులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకొని కొండచిలువను చంపివేశారు.


