నకిరేకల్: నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్‌లోని సువర్ణగార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా చేయాలన్నారు. బీఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి గుజ్జ దీపిక యుగేంధర్‌రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


