సైబర్‌ భద్రతపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ భద్రతపై అవగాహన ఉండాలి

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

భూదాన్‌పోచంపల్లి: సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందాలంటే సైబర్‌ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని హైదరాబాద్‌లోని కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ అప్పిచెర్ల రామకృష్ణప్రసాద్‌ అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీస్‌ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తపద్ధతుల్లో ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండి డిజిటల్‌ లావాదేవీలను సురక్షితంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత, బ్యాంక్‌ఖాతాల వివరాలు ఎవరికి ఇవ్వొద్దన్నారు.

అనంతరం సైబర్‌ ముప్పులను గుర్తించి, వాటి నుంచి రక్షణ ఎలా పొందాలో సైబర్‌ క్రైమ్‌ ఇన్విస్టిగేటర్‌, లెక్సినాన్‌ ఇన్ఫోటిక్‌ కంపనీ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మనీష్‌యాదవ్‌ వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డీన్లు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

ఫ సీఎస్‌ఐ చాప్టర్‌ చైర్మన్‌

అప్పిచెర్ల రామకృష్ణప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement