పెద్దవూర(నాగార్జునసాగర్) : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రశాంతతకు నిలయమని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శశిభూషణ్ ప్రసాద్ సింగ్ అన్నారు. గురువారం నాగార్జునసాగర్‌ను ఆయన సతీసమేతంగా సందర్శించారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరు కోర్టు సూపరింటెండెంట్ తిరుమలేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సాగర్ డ్యాం, బుద్ధవనాన్ని సందర్శించారు. అనంతరం ధ్యాన మందిరంలోని బుద్ధుడి విగ్రహం వద్ద బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా వారిని బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర ఘనంగా సత్కరించారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ చారిత్రక విశేషాలను వివరించారు. వీరితో పాటు స్థానిక ఏఎస్‌ఐ గురునాథం, నిడమనూరు కోర్టు సిబ్బంది ఖాలిక్ ఉన్నారు.
పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ శశిభూషణ్ ప్రసాద్ సింగ్


