వరి చేనుకు ట్యాంకర్‌తో నీరు | - | Sakshi
Sakshi News home page

వరి చేనుకు ట్యాంకర్‌తో నీరు

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

రాజాపేట : పంట ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోలేక రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రైతు కాలె నర్సింహులు వాటర్‌ ట్యాంకర్‌తో తన పొలానికి నీరు అందిస్తున్నాడు. ఆయన మూడు ఎకరాల్లో సన్న వడ్లను సాగు చేశాడు. మూడు బోర్లుకు గాను రెండు బోర్లు పూర్తిగా ఎండిపోగా.. ఉన్న నీటితో వరిచేను పొట్టదశకు చేరుకుంది. ఆ ఒక్క బోరులో కూడా నీరు తగ్గడంతో ఎకరంన్నర వరకు వరిచేను ఎండిపోయింది. మిగతా చేనునైనా కాపాడుకోవడానికి తన సొంత వాటర్‌ ట్యాంకర్‌తో ఇతర రైతుల నుంచి నీరు కొనుగోలు చేసి రోజుకు రెండు, మూడు ట్యాంకర్ల నీటిని వరి చేనుకు అందిస్తున్నాడు. రోజుకు రూ.600 వరకు ఖర్చవుతున్నట్లు రైతు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement