టిప్పర్‌ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని మహిళ మృతి

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

భువనగిరి(వలిగొండ) : స్కూటీపై వెళ్తున్న మహిళను టిప్పర్‌ ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన వలిగొండ మండలం సంగం వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం రాయగిరికి చెందిన చింతల లక్ష్మమ్మ(45) యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోది. దసరా సందర్భంగా వర్కట్‌పల్లిలోని తల్లిగారి ఇంటికి వచ్చి గురువారం తిరిగి స్కూటీపై రాయగిరికి వెళ్తుండగా.. సంగం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. లక్ష్మమ్మ తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాస్పకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement