దేవరకొండ : దేవరకొండ మండలం కాచారం గ్రామపరిధిలో కొనసాగుతున్న మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు గురువారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. తప్పుడు ప్రజాభిప్రాయ సేకరణతో అనుమతులు పొందిన మైనింగ్ పనుల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రామ పరిధిలోని రైతులు ఓవైపు పంటలు నష్టపోతూ మరోవైపు శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, నూనె రామస్వామి, పల్లా రంగారెడ్డి, ముదిగొండ శామలయ్య, మల్లేష్, మల్లయ్య, గోవర్ధన్, యాదయ్య, తిరుపతయ్య, కొండల్, గణేశ్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


