అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

హుజూర్‌నగర్‌ : మొబైల్‌ దుకాణాలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మఠంపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను గురువారం హుజూర్‌నగర్‌ సీఐ చరమంద రాజు ఎస్‌ఐ ప్రవీణ్‌తో కలిసి వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన చక్రవర్తి అలియాస్‌ బాబు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇటీవల మఠంపల్లిలోని ఓ మొబైల్‌ దుకాణంలో చక్రవర్తి చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన సెల్‌ఫోన్లను ఇతరులకు విక్రయించాడు. మొబైల్‌ దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు మఠంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడి ఆచూకీని గుర్తించారు. మఠంపల్లిలోని మొబైల్‌ దుకాణంలో మరోసారి చోరీ చేసేందుకు వచ్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు రూ.80వేల విలువైన 6 స్మార్ట్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒకటి, చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో ఒకటి, కోదాడ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు చోరీ కేసులు నమోదైనట్లు సీఐ పేర్కొన్నారు. 2023లో అతడు జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement