59 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీ పూర్తి | - | Sakshi
Sakshi News home page

59 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీ పూర్తి

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

మునగాల : చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు మునగాల మండల కేంద్రానికి చెందిన అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి. ఆయన 59 ఏళ్ల వయస్సులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మాల్వంచల్‌ యూనివర్సిటీ నుంచి మెడికల్‌ బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. డాక్టర్‌ జయాజైన్‌ మార్గదర్శకత్వంలో మూత్రపిండాల వైఫల్య రోగుల్లో ఆక్డిడేటివ్‌ స్ట్రెస్‌ మార్గాలపై పరిశోధన పూర్తిచేసి ఈ 13న పరిశోధనా థీసిస్‌ను సమర్పించారు. 14న ప్రొవిజనల్‌ ధృవీకరణ పత్రాన్ని యూనివర్సిటీ అధికారుల చేతులమీదుగా అందుకున్నారు. కాగా.. సెప్టెంబర్‌ 13న శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి అనంతమ్మ అనారోగ్యంతో మృతిచెందినప్పటికీ.. ఆ విషాధాన్ని దిగమింగుకొని తన లక్ష్యాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement