నల్లగొండ : పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం నల్లగొండలోని జీఎం కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సమా వేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభంగా.. అంతకుముందు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టారు. అనంతరం అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్ళులు విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల సాధన, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం తదితర అంశాలపై తీర్మానాలు పెట్టారు. వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలం నారాయణరెడ్డి, మేకల జాన్‌రెడ్డి, గీత, త్రివేణి, విజయలక్ష్మి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యవర్గం రద్దు..
గురువారం సాయంత్రం పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారు. కొత్తగా ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు పోటీ చేసే వారి నుంచి నామినేషన్ల స్వీకరించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగాయి. శుక్రవారం పీఆర్టీయూ రాష్ట్ర సంఘం ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర పోస్టులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నందున ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నూతన కార్యవర్గంచే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
20 ఏళ్ల తర్వాత మళ్లీ పోరు..
2006లో పీఆర్టీయూ రాష్ట్ర కమిటీకి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రతిసారి ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్..
పీఆర్టీయూ తరఫున నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్‌ను ప్రకటించారు.
ఫ మొదటి రోజు విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చ
ఫ సంఘం రాష్ట్ర కమిటీ రద్దు
ఫ నేడు నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక


