హత్య కేసులో జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో జీవిత ఖైదు

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

రాజాపేట : హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడినిట్లు రాజాపేట ఎస్‌ఐ తఖియోద్దీన్‌ గురువారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన మజ్జిగ యాదగిరి 2024 నవంబర్‌ 16న తన వ్యవసాయ బావి వద్ద పశువులకు మేతవేసి ఇంటికి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన వడ్లకొండ నాగరాజు హత్య చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన భువనగిరి ఒకటవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి మిలింద్‌ కాంబ్లే.. నిందితుడు నాగరాజుకు జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా, 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement