ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్‌ ్స నేర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్‌ ్స నేర్చుకోవాలి

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

మోత్కూరు: ఆత్మరక్షణ కోసం బాలబాలికలు చిన్నప్పటి నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, వినియోగదారుల హక్కుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోచం సోమయ్య అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జూడో పోటీలు మోత్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించారు. వివిధ కేటగిరీల్లో విజయం సాధించిన విద్యార్థులకు వారు మెడల్స్‌ అందజేసి అభినందించి మాట్లాడారు. బాలికలు జూడో నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి కె.దశరథరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతలను జూడో ఫౌండర్‌ పి.బాలరాజు, కోచ్‌లు అన్నెపు వెంకట్‌, ఎస్‌.పర్వేజ్‌, మోత్కూరు బ్యాంకు మాజీ చైర్మన్‌ చింతల విజయ భాస్కర్‌రెడ్డి, బుజిలాపురం మాజీ సర్పంచ్‌ చేతరాశి అంజయ్య అభినందించారు. కోచర్లు కనుకు రాజు, కె.సోమరాజు, బి.కార్తీక్‌, జె.వెంకటేష్‌, పి.మచ్చేందర్‌, యు.మత్స్యగిరి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ, జ్ఞానసుందరి, శ్వేత, నిఖిత, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement