లారీ డ్రైవర్‌కు ఒక్కరోజు జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌కు ఒక్కరోజు జైలుశిక్ష

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

మునగాల: మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి–65పై గల యూటర్న్‌ వద్ద ఈనెల 25న పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడిన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ పెద్దపోగు అవినాష్‌ను సోమవారం కోదాడ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోదాడ స్పెషల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎండి.ఉమర్‌ సదరు లారీ డ్రైవర్‌కు ఒక్కరోజు జైలుశిక్ష, రెండువేల రూపా యల జరిమానా విధించినట్లు మునగాల ఎస్‌ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు.

బస్సు డిపో గ్యారేజీలో స్వల్ప అగ్నిప్రమాదం

రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఆదివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గారేజీలో బస్సు మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో డిపో ప్రాంగణంలో కలకలం రేగింది. అయితే, అక్కడే ఉన్న గ్యారేజీ సిబ్బంది వెంటనే తేరుకుని గారేజీలో ఉన్న ఫైర్‌ సేఫ్టీ యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పారు. సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

మల్లగూడెంలో

మహిళ ఆత్మహత్య

రాజాపేట : కుటుంబంలో నెలకొన్న ఆర్థిక సమస్యల కారణంగా మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజాపేట మండలం మల్లగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుపుల మల్లేశం, భార్య మమత (25)లకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా మల్లేశం మేసీ్త్ర పని చేస్తుండగా భార్య మమత వ్యవసాయ కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా మమత సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్‌ఐ తఖీయొద్దీన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement