దేవరకొండ ఆసుపత్రిలో పడకల కొరత | - | Sakshi
Sakshi News home page

దేవరకొండ ఆసుపత్రిలో పడకల కొరత

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

దేవరకొండ : దేవరకొండ ఏరియా ఆసుపత్రిని పడకల (బెడ్ల) కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేవరకొండతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున రోగులు వివిధ వైద్యసేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ సుమారు 800 వరకు ఓపీ నమోదవుతుంది. రోగుల రద్దీకి తగ్గట్టుగా ఆసుపత్రిలో పడకలతోపాటు వసతులు లేవు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 100 పడకలు మాత్రమే అందుబాటులో ఉండగా.. నిత్యం అందుకు రెట్టింపు సంఖ్యలో ఇన్‌పేషెంట్లు చేరుతున్నారు. ఫలితంగా ఒక్కో బెడ్‌పై ఇద్దరు నుంచి ముగ్గురు రోగులను ఉంచి సైలెన్లు పెట్టి వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌ కేసులు అధికంగా నమోదవుతుండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రికి అవసరమైన అదనపు బెడ్లను వెంటనే మంజూరు చేయాలని పట్టణ ప్రజలు, రోగులు కోరుతున్నారు.

ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురికి వైద్యం

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement