నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం రెగల్ రెక్స్‌నార్డ్ సంస్థ సహకారంతో ప్లేస్‌మెంట్ డ్రైవ్–2026 నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన 130 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు తొలిదశలో నిర్వహించిన ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ప్లేస్‌మెంట్ నిబంధనల ప్రకారం తదుపరి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్, ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ జి.మారేశ్వరరావు, జయంతి, వై.నాగరాజు, వేణుగోపాల్‌రెడ్డి, రేఖ పాల్గొన్నారు.


